వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద NHAI (కోదాడ-ఖమ్మం జాతీయ రహదారి) ఆధ్వర్యంలో 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి పంచాయతీ ఆవరణలో మొక్క నాటారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో హైవే అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

