నేడు సిద్దిపేటలో 'ఇందిరమ్మ ఇన్సూరెన్స్' ప్రారంభం!

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, మహిళలకు అండగా నిలిచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్’ పథకానికి శ్రీకారం చుడుతోంది. గురువారం ఉదయం హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగే 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సుకు హాజరైన అనంతరం, సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో పర్యటించనున్నారు.
సిద్దిపేట పట్టణంలో ర్యాలీ తర్వాత బహిరంగ సభలో సీఎం ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...
