దేవాదుల కాలువ మట్టి.. దర్జాగా దోపిడీ!

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని దేవాదుల ప్రధాన కాలువ మట్టిపై అక్రమార్కుల కన్నుపడింది. ఇప్పగూడెం, చంద్రుతండా శివార్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రివేళల్లో భారీ టిప్పర్లతో మట్టిని వరంగల్, హనుమకొండ, జనగామ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
టిప్పర్ల రాకపోకలతో విపరీతంగా దుమ్ము రేగి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
