Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెదర్లాండ్స్‌పై భారత్‌ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 10:03 AM జాతీయంక్రీడలు
నెదర్లాండ్స్‌పై భారత్‌ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు - Udayam
చెస్‌ ఒలింపియాడ్‌ ఓపెన్‌ విభాగంలో భారత్‌ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. అయిదో రౌండ్‌లో నెదర్లాండ్స్‌ను 3-1తో ఓడించింది. ప్రజ్ఞానంద, గుకేశ్‌ తమ గేమ్‌ల్లో విజయం సాధించగా.. అర్జున్‌, నిహాల్‌ సరీన్‌ డ్రా చేసుకున్నారు. మహిళల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. పోలెండ్‌ చేతిలో 1.5-2.5తో ఓడింది. వైశాలి పరాజయం పాలవగా.. హంపి, దివ్య, వంతిక తమ గేమ్‌లను డ్రాగా ముగించారు.

Comments

G
Loading comments...