Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడిరోడ్డుపై మంటల్లో బైక్

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 6:21 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం అకస్మాత్తుగా ద్విచక్ర వాహనం షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. కురుపాం మండలం పీ. లేవిడికి చెందిన వాహన యజమాని పీ. కిరణ్ కుమార్ బైక్ నుంచి పొగలు రావడంతో వాహనాన్ని నిలిపి దూరంగా వెళ్లారు. క్షణాల్లో మంటలు వ్యాపించగా స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...