వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద 163వ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నీటి టిప్పర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

