Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరుకులపాడు పత్తి చేలో వర్షపు నీరు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 2:32 PM పల్నాడు General
నరుకులపాడు పత్తి చేలో వర్షపు నీరు - Udayam
అమరావతి మండలం నరుకులపాడు సమీపంలోని లోతట్టు పంట పొలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచిపోయింది. పత్తి చేలో నీరు నిలవడంతో పంట ఉడికిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేల గట్లకు గండ్లు కొట్టి నీటిని బయటకు పంపించినా లోతట్టు ప్రాంతాల్లో నీరు అలాగే ఉందని రైతులు తెలిపారు. మరింత వర్షం కురిస్తే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...