Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహం తొలగింపుపై నర్సంపేట బంద్

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 10:59 AM వరంగల్తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నర్సంపేటలో బంద్ కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విగ్రహాన్ని తొలగించడంతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బంద్‌లో భాగంగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Comments

G
Loading comments...