Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులకు ఎస్పీ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 10:13 AM నంద్యాలGeneral
పోలీసులకు ఎస్పీ కీలక ఆదేశాలు - Udayam
నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సునీల్ షోరాన్ సూచించారు. మంగళవారం నంద్యాల పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌ల ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సునీల్ షోరాన్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...