Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగాం: హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన

Follow Udayam on Google
Ravi Jun 13, 2026 11:34 AM శ్రీకాకుళంGeneral
నందిగాం: హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన - Udayam
నందిగాం మండలం పెద్ద తామరపల్లిలో ఉపాధి హామీ వేతనదారులకు శక్తి టీమ్ హెచ్సీ గిరిధర్, భీమారావు, మహిళా పోలీస్ విజయలక్ష్మి ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో ఆదుకునే కీలకమైన హెల్ప్‌లైన్ నంబర్లను తమ వద్ద ఉంచుకోవాలని వారు సూచించారు. ఆపదలో ఉన్నప్పుడు జాతీయ రహదారి సాయం కోసం 1033, పోలీసుల కోసం 112, 181, 1091 నంబర్లను సంప్రదించాలన్నారు. అలాగే గృహహింసకు 1930, బాల్య వివాహాల నిరోధానికి 1098 నంబర్లు మహిళలు, చిన్నారుల రక్షణకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

Comments

G
Loading comments...