వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పెద్దరెల్లి వీధికి చెందిన మాడుగుల షణ్ముఖరావు నాగావళి నదిలో గల్లంతయ్యారు. రాత్రి వినాయక నిమజ్జనోత్సవంలో భాగంగా విగ్రహాన్ని నదిలో దించుతున్న సమయంలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారాన్ని పోలీసులకు అందించగా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను చేపట్టారు. ఇప్పటివరకు ఆచూకీ తెలియరాలేదని రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. గాలింపు కొనసాగిస్తామన్నారు.
Comments
Loading comments...

