Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్లలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:13 PM పల్నాడు General
నాదెండ్లలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం - Udayam
నాదెండ్ల గ్రామంలో పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి అంకయ్య ఆధ్వర్యంలో ముమ్మరం చేశారు. వీధుల్లోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తను సిబ్బంది తొలగించారు. దోమల నివారణకు బ్లీచింగ్ చల్లి, ఫాగింగ్ చేయించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కార్యదర్శి సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...