వార్తలకు తిరిగి వెళ్లండి

తన వ్యాఖ్యలపై వివాదం నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వివరణ ఇచ్చారు.కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు స్క్రిప్టెడ్ సంభాషణలో భాగమేనని,ఎవరినీ బాధపెట్టడం లేదా అవమానించడం తన ఉద్దేశం కాదని తెలిపారు.
ప్రేమ,ఆప్యాయత,ఐక్యత,సౌభ్రాతృత్వం సందేశాన్ని అందించేందుకే ఆ మాటలు చెప్పానన్నారు.‘మున్నాభాయ్’ తరహాలో సరదాగా మాట్లాడాలని భావించానని,అయితే తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

