వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి మన్యంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పుట్టగొడుగులు విరివిగా పుట్టుకొస్తున్నాయి. జీకేవీధి మండలం కంపుమానుపాకల గ్రామానికి చెందిన రైతు భూపతి కాఫీ తోటలో అల్లిక మాదిరి వింత పుట్టగొడుగు కనిపించింది.
దీనిని ‘బ్రైడల్ వెల్ మష్రూమ్’ అని పిలుస్తారని ఉద్యానవన శాఖ మండల అధికారిణి అరుణకుమారి తెలిపారు. జన్యు లోపం కారణంగా పుట్టగొడుగు ఇలా ఏర్పడుతుందని వివరించారు.
Comments
Loading comments...

