Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూటపెల్లిలో శ్రీరామ హృదయ కలశ యాత్ర

Follow Udayam on Google
Devender Bale Aug 20, 2026 2:13 PM జగిత్యాలGeneral
మూటపెల్లిలో శ్రీరామ హృదయ కలశ యాత్ర - Udayam
మూటపెల్లిలో చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్రం సందర్భంగా శ్రీరామ హృదయ కలశ యాత్ర ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సంగెం కీర్తన రమేష్, ఉపసర్పంచ్ బోడ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నుంచి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. లోకకల్యాణం, దేశ–ధర్మ రక్షణ, ప్రజల సుభిక్షం కోసం శ్రీరాముడిని ప్రార్థించామన్నారు.

Comments

G
Loading comments...