Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూఢనమ్మకంతో మహిళను హత్య చేసిన ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్

Follow Udayam on Google
p.g.murthy Sep 10, 2026 1:23 AM మంచిర్యాలGeneral
మూఢనమ్మకంతో మహిళను హత్య చేసిన ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్ - Udayam
మంత్రాలు చేస్తున్నారనే మూఢనమ్మకంతో దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ కు చెందిన సింగతి లక్ష్మిని హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఏసీపి ప్రకాష్ తెలిపారు. సింగతి రమేష్, సింగతి రాంబాయి అనారోగ్యంతో బాధపడుతుండడంతో దానికి సింగతి లక్ష్మి కారణమని భావించి ఆమెను మంగళవారం రాత్రి దారుణంగా హత్య చేశారన్నారు. దీనిపై దర్యాప్తు జరిపి రమేష్, రాంబాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపామని తెలిపారు.

Comments

G
Loading comments...