Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెల అభివృద్ధి శూన్యం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 06, 2026 10:43 PM నిర్మల్General
మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెల అభివృద్ధి శూన్యం - Udayam
మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటు పడిందని బీఆర్ఎస్ నిర్మల్ నియోజక వర్గ ఇన్చార్జి కే రాం కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం రూరల్ మండలం లంగ్డాపూర్ లో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పిలుపుమేరకు పారిశుద్ధ్య పనులను నాయకులు కార్యకర్తలతో కలిసి చేపట్టారు. ఇందులో నాయకులు మహేష్ రెడ్డి, ముత్యంరెడ్డి, ప్రశాంత్, అయ్యుబ్ ఖాన్ లు ఉన్నారు.

Comments

G
Loading comments...