Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యంపేట వద్ద వాహనాల రాకపోకలు పునరుద్ధరణ

Follow Udayam on Google
p.g.murthy Jul 30, 2026 2:35 PM మంచిర్యాలGeneral
ముత్యంపేట వద్ద వాహనాల రాకపోకలు పునరుద్ధరణ - Udayam
దండేపల్లి మండలంలోని ముత్యంపేట వద్ద నిలిచిపోయిన రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. భారీ వర్షాలు కురవడంతో గురువారం ఉదయం ముత్యంపేటలోని జన్నారం-మంచిర్యాల రహదారిపై పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడకు చేరుకుని పడిపోయిన చెట్టును జెసిబి సహాయంతో తొలగింప చేశారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలన్నారు.

Comments

G
Loading comments...