వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి మండలం వేలంక, వీరవరం గ్రామాల్లో భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం పరిశీలించారు.
అధికారులతో కలిసి మోకాళ్ల లోతు వరద నీటిలోకి దిగి బాధితులను పరామర్శించారు. నీట మునిగిన పంట పొలాలు, ఇళ్లను పరిశీలించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

