వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ సాయినగర్‌లో 1, 2, 3వ వార్డుల లబ్ధిదారులకు టీడీపీ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్ గురువారం పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ నగదు అందజేశారు.
లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని మనోహర్ తెలిపారు.
Comments
Loading comments...

