వార్తలకు తిరిగి వెళ్లండి
గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలోనీ శివసాయి కాలనీ ఆధ్వర్యంలో శివాలయంలో మట్టి వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించిన భక్తులు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు. మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో శివసాయి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

