Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 11, 2026 6:22 PM మంచిర్యాలGeneral
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలి - Udayam
పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయాలని లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మహాత్మా సంతోష్ కోరారు. వినాయక చవితిని పురస్కరించుకొని శుక్రవారం కళాశాల ఆవరణలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి మట్టి వినాయకుని తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహంతో ప్రకృతికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...