వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ 23వ వార్డులోని మటన్ మార్కెట్ సమీపంలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటువైపు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

