వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం రఘుపతిపేటలోని సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో మట్టిగుట్టను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. సుమారు పదెకరాల మట్టిగుట్టను రాత్రివేళల్లో తవ్వి తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆలయ భూములపై కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలపై అధికారులు స్పందించారు. అక్రమ తరలింపుదారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

