వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ స్కూలు వద్ద మౌలాభి ఆదివారం నిరసనకు దిగారు. ఆరు నెలల క్రితం మరణించిన తన కుమారుడు తౌషిక్ మృతికి బాధ్యులపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
తన కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్యేనని మౌలాభి ఆరోపించారు. న్యాయం జరిగేవరకు పోరాటం ఆపనని స్పష్టం చేశారు. రాత్రి 9 గంటలకు పోలీసులు నచ్చజెప్పి ఆమెను ఇంటికి పంపించారు.
Comments
Loading comments...

