వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజావాణిలో చదువుల తల్లి
Harika Jun 22, 2026 1:13 PM సిరిసిల్ల 9 viewsabout 1 hour ago

సిరిసిల్ల కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ తల్లి ఆదర్శంగా నిలిచింది. తన పని కోసం వేచి ఉన్న సమయంలో సమయాన్ని వృథా చేయకుండా, తన చిన్నారికి సెల్‌ఫోన్‌లో పాఠాలు నేర్పిస్తూ అందరినీ ఆకట్టుకుంది.
‘అమ్మే తొలి గురువు’ అన్న నానుడిని నిజం చేస్తూ, ఆ తల్లి చూపిన చదువుపై శ్రద్ధ అక్కడి వారిని మెచ్చుకునేలా చేసింది. ప్రజావాణి ప్రాంగణంలో ఈ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది.
Comments
Loading comments...