వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 26 నుంచి శ్రీవారి అంతరాలయ దర్శనం ప్రారంభం కానుంది. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి పరిశీలించారు.
ఈనెల 23 నుంచి జరిగే అష్టబంధన మహా సంప్రోక్షణ మహోత్సవానికి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

