Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై అనుమానంతో... హత్య

Follow Udayam on Google
Sai Sep 07, 2026 5:42 PM జాతీయంGeneral
భార్యపై అనుమానంతో... హత్య - Udayam
మధ్యప్రదేశ్‌లో భార్యపై అనుమానంతో రామ్‌ప్రసాద్‌ రైక్వార్‌ తన మామ రమేశ్‌ రైక్వార్‌ (65)ను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దమోహ్‌ జిల్లా పిప్రౌధా గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఘటన జరిగింది. అడ్డుకునేందుకు వచ్చిన మృతుడి పెద్ద కుమార్తెపై కూడా నిందితుడు దాడి చేయడంతో ఆమె గాయపడింది. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...