Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనాథ బాలికలకు 'తల్లికి వందనం' దూరం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 9:54 AM కర్నూలుGeneral
అనాథ బాలికలకు 'తల్లికి వందనం' దూరం - Udayam
కర్నూలు జిల్లా హాలహర్విలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు ‘తల్లికి వందనం’ పథకం అందడం లేదని బంధువులు తెలిపారు. విశ్వనాథ్, వరలక్ష్మి దంపతులు మూడు నెలల వ్యవధిలో మృతిచెందడంతో మమత(14), మానస(10) అనాథలుగా మిగిలారు. మమత 10వ తరగతి, మానస 5వ తరగతి చదువుతున్నారు. చిన్నారుల చదువు, భవిష్యత్తుకు ప్రభుత్వం, దాతలు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...