వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల అకాల మరణం చెందిన నిజామాబాద్కు చెందిన శేషాల నరేష్ - మేఘన దంపతుల పిల్లలకు మోస్రా పాఠశాల 2002-2003 ఎస్ఎస్సీ (SSC) బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.90 వేల ఆర్థిక సాయం అందించారు. మిత్రుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులంతా కలిసి ఈ మొత్తాన్ని సేకరించారు.
సోమవారం బ్యాచ్ మిత్రులు సాయిప్రసాద్, వినయ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి దగ్గరుండి ఈ నగదును చిన్నారులకు అందజేశారు.
Comments
Loading comments...

