Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపాల్‌లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

Follow Udayam on Google
R.R. Reddy Sep 27, 2026 6:36 PM నిజామాబాద్తెలంగాణ
మోపాల్‌లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం - Udayam
మన ఊరు– మన బాధ్యత’లో భాగంగా ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. యోగా టీం ఆధ్వర్యంలో యోగా చిన్నారులు, సభ్యులు, గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బందితో కలిసి ప్రభుత్వ పాఠశాల ఎదుట గడ్డి, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో అక్షర, సన్నీ, ఆకృతి, సహస్ర, భానవి, నవీన్‌రెడ్డి, గంగాధర్, నడ్పన్న, శేఖర్, గంగమల్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...