Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటిన పేరూరు సర్పంచ్

Follow Udayam on Google
anji kummari Aug 24, 2026 8:44 PM మహబూబ్‌నగర్General
మొక్కలు నాటిన పేరూరు సర్పంచ్ - Udayam
కౌకుంట్ల మండల పరిధిలోని పేరూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ కొత్త శృతి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక్క మొక్క అనే మంచి సంకల్పంతో గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికి ఒక మొక్కను అందజేయడం జరిగిందన్నారు. మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...