వార్తలకు తిరిగి వెళ్లండి

మందసలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఏఎస్ఐ కే. జనార్ధన రావు సూచించారు. మందస కొత్తవీధి డివైడర్ వద్ద ‘గో గ్రీన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణకు యువత, విద్యార్థులు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. సమాజ సేవకుడు ఎన్ని తిరుపతిరెడ్డి, ఎస్‌ఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

