వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు మండలం మరితిప్పలో భవన నిర్మాణ మేస్త్రీ ఎలుమర్తి బాలాజీ (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులే పురుగుల మందు తాగించి హత్య చేసి ఉంటారని బాలాజీ సోదరి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనుల కోసం భార్య, అత్తమామలు, మేనమామతో కలిసి అక్కడికి వచ్చినట్లు తెలిసింది.
Comments
Loading comments...

