Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికత: ఎస్పీ

Follow Udayam on Google
రాజిత దేవి Aug 12, 2026 4:20 PM ఏలూరుGeneral
నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికత: ఎస్పీ - Udayam
నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని ఎస్పీ కె. ప్రతాప్‌ శివ కిశోర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన క్రైమ్‌ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్‌ నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలని, గంజాయి కట్టడికి డ్రోన్లతో నిఘా పెంచాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలని, హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...