వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఆధునిక, శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ధర్మవరం ఏడీఏ లక్ష్మా నాయక్ సూచించారు. మంగళవారం బత్తలపల్లి మండలం రామాపురంలో ఏవో ఓబిరెడ్డి అధ్యక్షతన పొలం పిలుస్తోంది-పొలం బడి కార్యక్రమం నిర్వహించారు.
రైతులకు సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. పంటలను క్రమం తప్పకుండా పరిశీలించి చీడపీడలను తొలిదశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వారు సూచించారు.
Comments
Loading comments...

