వార్తలకు తిరిగి వెళ్లండి
సిర్సన్నలో మోడల్ సోలార్ విలేజ్ సర్వే

గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘మోడల్ సోలార్ విలేజ్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బేల మండలం సిర్సన్నలో టీజీ రెడ్కో అధికారులు సర్వే చేపట్టారు.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు వంద శాతం రాయితీతో 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఇవి ఉచితంగా అందనుండగా, అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం పొందవచ్చు.
Comments
Loading comments...