Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క ఇలాకాలో రోడ్ల దుస్థితి.. బురద రోడ్డుపై మృతదేహం తరలింపు

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 11:31 AM హైదరాబాద్General
ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో రోడ్ల దుస్థితిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో బురద రోడ్డుపై మృతదేహాన్ని గ్రామస్తులు పాడెపై మోసుకుంటూ తరలించారు. రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండటంతో పాడెపై నుంచి మృతదేహం కిందపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...