Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న కృష్ణా వరద ఉధృతి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 11:37 AM అమరావతిGeneral
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న కృష్ణా వరద ఉధృతి - Udayam
భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కృష్ణానది వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ కాలువలకు 8,000 క్యూసెక్కుల నీటిని మళ్లించగా, గేట్లు ఎత్తి సముద్రంలోకి 47,125 క్యూసెక్కుల మిగులు నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...