Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాల అనుమానంతో మహిళ దారుణ హత్య

Follow Udayam on Google
madhu Sep 09, 2026 10:40 AM మంచిర్యాలGeneral
మంత్రాల అనుమానంతో మహిళ దారుణ హత్య - Udayam
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో సింగతి లక్ష్మి (42)ను ఆమె మరిది అర్ధరాత్రి దారుణంగా నరికి హత్య చేసినట్లు సమాచారం. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు మంత్రాలపై అనుమానమే కారణమా, కుటుంబ కలహాలా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. మూఢనమ్మకాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

Comments

G
Loading comments...