వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం మణికేశ్వరం ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగాయి. ఛైర్మన్‌గా అనిల్, వైస్ ఛైర్మన్‌గా కవిత ఎన్నికయ్యారు. 12 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటైంది.
ఏకగ్రీవ ఎన్నిక విద్యార్థుల భవిష్యత్తుకు మంచి సంకేతమని టీడీపీ నేత షేక్ కరిముల్లా అన్నారు. నూతన కమిటీ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

