వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి మండలం రాజేశ్వర్ రావ్ పేటలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. నిమజ్జనం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
అనంతరం అలంకరించిన వాహనంపై విగ్రహాన్ని గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్రగా తరలించారు. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నామస్మరణలు చేశారు.
Comments
Loading comments...

