వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మండలం ఆత్మకూరు పెట్రోల్ బంక్ సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే స్పందించి సమాచారం అందించడంతో, అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

