వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలం ఒబులాపూర్లో మంగళవారం కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందగా వెంటనే మల్యాల పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.6,780 నగదు, పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట నిర్వహించడం, డబ్బులు పందెంగా పెట్టి జూదం ఆడడం చట్టరీత్యా నేరమని మల్యాల ఎస్ఐ సందీప్ హెచ్చరించారు.
Comments
Loading comments...

