Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లూరు గుట్టపై భక్తుల రద్దీ

Follow Udayam on Google
madhu Sep 13, 2026 10:28 AM ములుగుGeneral
మల్లూరు గుట్టపై భక్తుల రద్దీ - Udayam
మంగపేట మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తజనం పోటెత్తారు. ఉదయాన్నే చింతామణి వాగులో స్నానాలు చేసిన భక్తులు స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. తిలతైలాభిషేకంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు స్వామివారికి తైలాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించి అలంకరించారు. గోత్రనామాలతో ఆలయం మారు మోగిందని అర్చకులు తెలిపారు.

Comments

G
Loading comments...