వార్తలకు తిరిగి వెళ్లండి

టూరిస్ట్ వీసాపై మలేషియాకు వెళ్లి పోలీసుల అదుపులో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు యువకులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 17న కోర్టు విచారణ అనంతరం వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. విదేశీ ఉద్యోగాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

