వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జరిగిన రాష్ట్ర ఎస్‌కేడీ ఏపీ అఫీషియల్ కరాటే టోర్నమెంట్‌లో పాణ్యం నియోజకవర్గం 26వ వార్డుకు చెందిన విద్యార్థులు పలు పతకాలు సాధించారు.
విజేతలను ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి సత్కరించి అభినందించారు. బంగారు, రజత, కాంస్య పతకాలు గెలిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, విశాఖపట్నంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

