వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి మండలం మక్కపేటలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తాగునీరు, విద్యుత్ పోల్స్, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్స్, సీసీ రోడ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పంచాయతీరాజ్, సంబంధిత శాఖల నిధులతో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

