Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ పైప్ లైన్లకు మరమ్మత్తులు

Follow Udayam on Google
p.g.murthy Aug 07, 2026 10:29 AM మంచిర్యాలGeneral
మిషన్ భగీరథ పైప్ లైన్లకు మరమ్మత్తులు - Udayam
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్లకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని మురిమడుగు, తదితర గ్రామాలలో గుంతలు ఏర్పడి పైప్లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సిబ్బంది యుద్ద ప్రాతిపదికన పైపులైన్లకు మరమ్మతులు చేస్తూ నీటి సరఫరాలను పునరుద్ధరిస్తున్నారు. పైప్ లైన్లకు శాశ్వత మరమ్మతులు చేయాలని ప్రజలు కోరారు.

Comments

G
Loading comments...