Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల దాటినా దొరకని రెండేళ్ల చిన్నారి ఆచూకీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 07, 2026 7:29 AM కాకినాడGeneral
నెల దాటినా దొరకని రెండేళ్ల చిన్నారి ఆచూకీ - Udayam
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ నెల రోజులు గడిచినా ఇంకా లభించలేదు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాప కనిపించకుండా పోయిన సమయంలో గ్రామంలో తిరిగిన ఓ కారుపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...